📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణడంపింగ్ యార్డు ఎత్తివేతకై పోరాడు తామన్న అఖిలపక్షం ప్రణాళికను స్వాగతిస్తున్నాం

డంపింగ్ యార్డు ఎత్తివేతకై పోరాడు తామన్న అఖిలపక్షం ప్రణాళికను స్వాగతిస్తున్నాం

📰 Generate e-Paper Clip

డంపింగ్ యార్డు ఎత్తివేతకై పోరాడు తామన్న అఖిలపక్షం
ప్రణాళికను స్వాగతిస్తున్నాం–

– జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి(జేఏసి)

జవహర్ నగర్ నవంబర్ 3 (ప్రజావాణి ప్రతినిధి):

నాగారం ఎంవైఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తోటకూర వజ్రేష్ యాదవ్ సమక్షంలో జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని, అందులో ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికను జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటి స్వాగతిస్తోందని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ ప్రకటించారు. అదే సమయంలో దాని కార్యాచరణ పట్ల వారం తర్వాత తాము ఏర్పాటు చేసే సమావేశంలో తమ జేఎసి నిర్ణయాలను వెళ్ళడిస్తామన్నారు.దాన్ని30 రోజులకు కదించేలా చేయాలనే ఆలోచన చేయాలని సూచించారు.
27 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యపై అధికార పార్టీ చొరవ తీసుకుని అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయడం రాజకీయంగా కాకుండా,ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందుల నుండి చూడాలని అన్నారు.
ఈ సందర్భంగా ఈసమావేశంలో 12 డిమాండ్లతో కూడిన తమ వైఖరి పత్రాన్ని అఖిలపక్షానికి అందజేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా, ప్రజల ప్రాణాల కోణంలో ఈ డిమాండ్లను పరిగ ణించాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నా రు.
డంపింగ్ యార్డును ఆధునీకరణ పేరుతో అక్కడే కొనసాగించ కుండా, శాశ్వత ఎత్తి వేతకు అసెంబ్లీలో ప్రకటన చేసి, జీఓను విడుదల చేయాలనీ,
లక్షల టన్నుల లెగసీ చెత్తను 12 నెలల్లో బయో-మైనింగ్ చేసి, ఆ స్థలాన్ని బయో- డైవర్సిటీ పార్క్ గా మార్చాలని, 15 కి.మీ పరిధిలోని ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు, రూ. 20 లక్షల ఉచిత ఇన్సూ రెన్స్ ప్రకటించాలని, బాధితులకు ఆస్తి పన్ను మాఫీ, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, మోడల్ స్కూల్స్ కల్పించాలి.
3000 మంది వేస్ట్ వారియర్స్ కు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మట్రో పాలిటన్ వాటర్ సప్ల్యైలో ఉద్యోగ అవకాశాలు, డబుల్ బెడ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని లేదా రూ. 50 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రా న్ని సమర్పించడం జరిగిందని అన్నారు. 109 రోజుల ప్రణాళి క కేవలం ప్రకటనగా మిగిలిపోకుండా, శాశ్వత పరిష్కార దిశగా అడుగు పడా లని, ఇందుకోసం జవహర్ నగర్ జేఏసి సంపూర్ణంగా సహక రిస్తుందని చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ తెలి పారు.
అఖిలపక్షం ప్రకటించి న వారం రోజుల గడువులోగా అందరి భాగస్వామ్యంతో కూడిన శాశ్వత అఖిలపక్ష సాధన కమిటీని ఏర్పాటు చేసి, నెలకు ఒకసారి కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష జరిపి, డంపింగ్ యార్డు శాశ్వత ఎత్తివేత దిశగా ప్రభుత్వం వేకవంతంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. జేఏసి కో కన్వీనర్స్ టిఆర్ఎస్ మేక లలిత యాదవ్, సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ గడ్డం సదానందం, సిపిఐ దర్శనం యాదగిరి, సిపిఎం శివన్నారాయణ, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మహ్మద్ పాషామియా, బహుజన రక్షణ సమితి మహ్మద్ జావేద్, టియుసిఐ వి.ప్రవీణ్, పిఓడభ్ల్యూ(విముక్తి) గడిపే సునీత, ఏ.ఐ.టి.యు.సి. అంబాల ఎల్లయ్య, సిఐటియు నర్సింహులు, శ్రావణ్ కుమార్ తదితరులు అఖిలపక్షం సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.