📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనాయకులను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

📰 Generate e-Paper Clip

నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 3 ప్రజావాణి:

,కురవి మండలంలోని స్టేషన్ గుండ్రతిమడుగు గ్రామానికి చెందిన పలువురు నాయకులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.

ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న గ్రామ మాజీ సర్పంచ్ పాల్త్యా లాలు గారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు,

అనంతరం అదే గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దేవత్ కబీర్ గారు శస్త్రచికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

అలాగే ఇటీవల ప్రమాదానికి గురై రెండు చేతులు విరిగి చికిత్స అనంతరం కోలుకుంటున్న ఇస్లావత్ బద్రు గారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బోడ శ్రీను నాయక్, భూక్య కోటేష్, వీరన్న, సూర్య, తేజావత్ రాజు, భూక్య ధన్సింగ్, చిన్న, శ్రీను, చందు, రకేడ్జ్, మాణిక్ రావు, భూక్య రమేష్, లోక్య, సురేష్, రుడావత్, సుమన్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.