📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ పెద్ద చెరువు కట్టపై మైనింగ్ అధికారుల మెరుపు దాడి: అక్రమ ఇసుక టిప్పర్ సీజ్.....

బద్వేల్ పెద్ద చెరువు కట్టపై మైనింగ్ అధికారుల మెరుపు దాడి: అక్రమ ఇసుక టిప్పర్ సీజ్.. రూ. 25 వేల జరిమానా విధింపు!

📰 Generate e-Paper Clip

గిద్దలూరు అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతోనే సోమశిల నుంచి అక్రమ రవాణా? అనుమతులు లేకుంటే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరిక!

బద్వేల్, నవంబర్ 03:ప్రజావాణి మండల పరిధిలోని బద్వేల్ పెద్ద చెరువు కట్టపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక భారీ టిప్పర్‌ను మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం రాత్రి చాకచక్యంగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు, రవాణా అనుమతి పత్రాలు (వే బిల్లులు) లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నందుకు గాను సదరు టిప్పర్ యజమానికి అధికారులు రూ. 25,000 భారీ జరిమానా విధించారు.

ఎమ్మెల్యే అండదండలతోనే అక్రమ రవాణా?

నమ్మదగిన సమాచారం ప్రకారం.. సోమశిల నుంచి గిద్దలూరు ప్రాంతానికి ఈ ఇసుక అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. గిద్దలూరు నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు, అండదండలతోనే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని స్థానికంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా ప్రధాన రహదారుల గుండా నిబంధనలు నడిరోడ్డుపై గాలికొట్టేస్తూ ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

రంగంలోకి దిగిన మైనింగ్ బృందం

పెద్ద చెరువు కట్ట మీదుగా ఇసుక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ (ఏపీ 39 వీయూ 0199) పై మైనింగ్ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సదరు వాహనాన్ని ఆపి రికార్డులను పరిశీలించగా, ఇసుక రవాణాకు సంబంధించిన ఎటువంటి రశీదులు కానీ, ప్రభుత్వ అనుమతి పత్రాలు కానీ లభించలేదు. దీంతో తక్షణమే స్పందించిన అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 25 వేల పెనాల్టీ విధించారు.అనుమతులు లేకుంటే చట్టపరమైన చర్యలు డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అక్రమ మైనింగ్ మరియు ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని స్పష్టం చేశారు.ఎటువంటి ప్రభుత్వ ముందస్తు అనుమతులు, సరైన రశీదులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా సరే సహించేది లేదని తేల్చి చెప్పారు. చట్టాన్ని అతిక్రమించే వాహనాలపై భారీ జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. సహజ వనరుల దోపిడీని అరికట్టేందుకు తనిఖీలను మరింత ఉధృతం చేస్తామని ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.