📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅక్రమంగా ఇసుక, మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

📰 Generate e-Paper Clip

అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: కుల్కచర్ల పోలీసులు హెచ్చరిక
* అనంతసాగర్ సమీపంలో ట్రాక్టర్ సీజ్.. ఒకరిపై కేసు నమోదు.

పరిగి /కుల్కచర్ల, నవంబర్ 03 (ప్రజావాణి )

మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణా చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కుల్కచర్ల పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా ట్రాక్టర్ ద్వారా అక్రమంగా మట్టి/ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా సాగిస్తున్న TS 31 H 6671 నంబర్ గల ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనలో అనంతసాగర్ గ్రామానికి చెందిన ముసలి హన్మంత్ (తండ్రి పెంటయ్య, 40) అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్:
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక, మట్టి, కంకర తదితర మైనింగ్ సంబంధిత ఖనిజాలను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం లేదా తరలించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అక్రమ రవాణాకు సహకరించే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మండల పరిధిలో ఎక్కడైనా అక్రమ రవాణా లేదా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రజలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.