📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి..

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి..

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి..

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02 (ప్రజావాణి): జిల్లా లోని బచ్చన్నపేట మండలం, కొన్నె గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బచ్చన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకుని అకాల మృతి చెందడం జనగామ నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన లక్ష్మణ్ గౌడ్, నిత్యం ప్రజా సమస్యలపై స్పందించే వ్యక్తిగా, రైతులకు అండగా నిలిచే నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం బచ్చన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు.

ఈ విషాదకర వార్త తెలుసుకున్న వెంటనే జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం హుటాహుటిన కొన్నె గ్రామంలోని లక్ష్మణ్ గౌడ్ నివాసానికి చేరుకొని మృత దేహానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ గౌడ్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఒక నిబద్ధత కలిగిన ఉద్యమకారుడిని, మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో తామంతా అండగా ఉంటామని, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. లక్ష్మణ్ గౌడ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.