📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ కాంగ్రెస్ మహా సమరభేరి పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే

ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ కాంగ్రెస్ మహా సమరభేరి పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ కాంగ్రెస్ మహా సమరభేరి పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 01 (ప్రజావాణి): దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల బలోపేతం, ఓటు హక్కు పవిత్రతను కాపాడాలనే మహోన్నత లక్ష్యంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన “ఓట్ చోరీకి వ్యతిరేకంగా మహా సమరభేరి” కార్యక్రమం అత్యంత భారీగా, ప్రతిష్టాత్మకంగా జరిగింది.

ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని తన సంఘీభావాన్ని ప్రకటించారు.

దేశం నలుమూలల నుండి లక్షలాది మంది కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు. ఈ వేదికపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కలిసి ఐక్యంగా పాల్గొన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, వివిధ అనుబంధ సంఘాల నాయకులు ఢిల్లీకి తరలివెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ “భారత ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం ఒక హక్కు కాదు, అది ప్రతి పౌరుడి ఆత్మగౌరవం. అత్యంత పవిత్రమైనది. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలి. ధనిక, పేద, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఓటు చెల్లుబాటు కావాలి.

కానీ నేడు దేశంలో జరుగుతున్న తీరు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల జాబితాల్లో అక్రమంగా పేర్లు తొలగించడం, దొంగ ఓట్లను చేర్చడం, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం అనేది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దీనినే మా నాయకులు రాహుల్ గాంధీ గారు ‘ఓట్ చోరీ’ అని అభివర్ణించారు.

ప్రజల తీర్పే ప్రజాస్వామ్యానికి పునాది. ఆ తీర్పును గౌరవించడం, కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎన్నికల ప్రక్రియలో 100% పారదర్శకత ఉండాలి. ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు తావులేకుండా చూడాలని, కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.

ఓటు హక్కు పరిరక్షణ, రాజ్యాంగ విలువల బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేస్తున్న ఈ చారిత్రాత్మక పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం” అని పిలుపునిచ్చారు.

రాంలీలా మైదానంలో నిర్వహించిన ఈ సమరభేరి కార్యక్రమం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోతుందని, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.