📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణత్యాగాల స్ఫూర్తితో విముక్తికై పోరాడుదాం..

త్యాగాల స్ఫూర్తితో విముక్తికై పోరాడుదాం..

📰 Generate e-Paper Clip

త్యాగాల స్ఫూర్తితో విముక్తికై పోరాడుదాం..
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్
ప్రజావాణి,నెల్లికుదురు: అమరులైన వీరుల ప్రాణ త్యాగాల స్ఫూర్తితో దేశ విముక్తి కై పోరాడాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి,తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్నలు అన్నారు. నవంబర్ 1 నుంచి 7 వరకు అమరవీరుల సంస్మరణ సభల వారోత్సవాలలో భాగంగా మండలంలోని రావిలాల సురేషన్న, ఆలేరు గణపతి స్థూపాల వద్ద ఆదివారం జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ విఫలమైనారన్నారు.భారత విప్లవోద్యమంలో వందల వేల మంది అమరులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో పేదరికం నిరుద్యోగం పెరుగుతున్నాయని దీనిపై సమరశీల పోరాటాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తొర్రూర్ డివిజన్ నాయకులు జక్కుల యాకయ్య,సిపిఐ(ఎంల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు బూర్గుల మోష,తోపాటు ఈర్ల వెంకన్న, దొడ్డ కేశవులు,కావటి రమేష్, అమంద వెంకన్న,జాగటి సూరయ్య తదితరులు పాల్గొన్నారు. మండలంలోని మెచరాజుపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.