📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణట్రెజరీ శాఖలో 36 సంవత్సరాల విశిష్ట సేవలందించిన కామ్రేడ్ మన్నేపల్లి వెంకటేశ్వరరావు

ట్రెజరీ శాఖలో 36 సంవత్సరాల విశిష్ట సేవలందించిన కామ్రేడ్ మన్నేపల్లి వెంకటేశ్వరరావు

📰 Generate e-Paper Clip

ట్రెజరీ శాఖలో 36 సంవత్సరాల విశిష్ట
సేవలందించిన కామ్రేడ్ మన్నేపల్లి వెంకటేశ్వరరావు

– తెలంగాణ ఉద్యమాల లో క్రియాశీలక పాత్ర

– ఏలూరి శ్రీనివాసరావు ఘన నివాళి

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ట్రెజరీ శాఖలో సుమారు 36 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, విశిష్టమైన సేవలందించి, సబ్ ట్రెజరీ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన ఆప్తులు మన్నెపల్లి వెంకటేశ్వరరావు గుండెపోటుతో అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు, టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు.
ఈ సందర్భంగా వారి పార్థివ దేహానికి ఏలూరి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి కార్యవర్గ సభ్యులు, టీఎన్జీవో అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదెన శ్రీనివాసరావు, మల్లెల రవీంద్ర ప్రసాద్ గంగవరపు నరేంద్ర తాళ్లూరు శ్రీకాంత్ పెద్దినేని రాధాకృష్ణ శ్రీనివాసరావు ట్రెజరీ శాఖ నుండి వి సత్యనారాయణ దుర్గా ప్రసాద్ ఎన్ వి కృష్ణారావు ఎస్కే ఖాజామియా విఠల్ రెడ్డి ఎమ్ వెంకటేశ్వర్ ఉమామహేశ్వరరావు బానోత్ దస్రు ప్రసన్నకుమార్ శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు రామకృష్ణ రామ్మూర్తి కృష్ణకుమారి రాజా సాహెబ్ రవిచంద్ర ప్రవీణ్ సౌజన్య జ్యోతి తదితరులు మరియు ఖమ్మం జిల్లా రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నుండి సుబ్బయ్య వై వెంకటేశ్వర్లు వేణు రమణ యాదవ్ కల్యాణ నాగేశ్వరావు రవికుమార్ పి.పుల్లయ్య రవికుమార్ జిల్లా నాయకులు, ట్రెజరీ శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొని మన్నెపల్లి వెంకటేశ్వరరావు భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన్నెపల్లి వెంకటేశ్వరరావు గారు ట్రెజరీ శాఖలో 36 సంవత్సరాల పాటు అంకితభావంతో, నిబద్ధతతో పనిచేసి ఉద్యోగ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు వంటి కీలకమైన బాధ్యతలు నిర్వహించే ట్రెజరీ శాఖలో సుదీర్ఘకాలం పనిచేస్తూ, తన విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, సమయపాలనకు ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు.
అధికారిగా మాత్రమే కాకుండా సహచర ఉద్యోగులకు ఆప్తుడిగా, స్నేహశీలిగా, ఆపదలో అండగా నిలిచే వ్యక్తిగా ఆయన అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, సహచరులతో ఆత్మీయ సంబంధాలను కొనసాగించేవారని గుర్తుచేసుకున్నారు.
ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వెంకటేశ్వరరావు గారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, సకల జనుల సమ్మెతో పాటు ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక ఉద్యమ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖమ్మం జిల్లాలో జరిగిన ఉద్యమ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొని, ఉద్యమ నాయకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన చేసిన సేవలు, ఉద్యోగుల హక్కుల సాధన కోసం చూపిన చొరవ ఎప్పటికీ స్మరణీయమని పేర్కొన్నారు.
36 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎన్నో సేవలందించి, ఉద్యోగుల ఉద్యమాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఒక మంచి సహచరుడిని, ఉద్యమ స్ఫూర్తి కలిగిన నాయకుడిని కోల్పోవడం ఉద్యోగ లోకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.