📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనేర రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: కులకచర్ల ఎస్సై రమేష్ కుమార్.

నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: కులకచర్ల ఎస్సై రమేష్ కుమార్.

📰 Generate e-Paper Clip

నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: కులకచర్ల ఎస్సై రమేష్ కుమార్..
* బండవెల్కిచర్ల గ్రామంలో ఘనంగా అవగాహన సదస్సు
* సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై దిశానిర్దేశం
* డ్రగ్స్, గంజాయి వాడకంపై ఉక్కుపాదం తప్పదు: ఎస్సై రమేష్ కుమార్ హెచ్చరిక

పరిగి/కులకచర్ల:నవంబర్ 1,ప్రజావాణి :

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కులకచర్ల సబ్-ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. కులకచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో గ్రామస్తులు, యువతతో కలిసి సీసీటీవీల ఆవశ్యకత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ మరియు రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
* గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: నేరాల నియంత్రణలో, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడంలో సీసీటీవీలు మూడో కన్నులా పనిచేస్తాయన్నారు. గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రధాన కూడళ్లు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
* సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద మెసేజ్‌లు, లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ (OTP) ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
* మత్తు పదార్థాలకు యువత దూరం: గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరైనా మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడినా, వినియోగించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
* రహదారి భద్రత – జీవన రక్ష: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మితిమీరిన వేగంతో నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు గ్రామ ప్రజలు, యువత పోలీసు శాఖకు ఎల్లప్పుడూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.