📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.

శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.

📰 Generate e-Paper Clip

శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.

పరిగి:నవంబర్ 01,(ప్రజావాణి )

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి నాగుల శిల్ప ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి నాగుల శిల్ప మాట్లాడుతూ, చిన్నారుల రక్షణ, భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ల మధ్య తేడాలను వివరంగా తెలియజేశారు. ఆపద లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థవంతంగా తప్పించుకునేందుకు ఐదు కీలక సూచనలను విద్యార్థులకు వివరించారు:
గట్టిగా అరవడం: అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు భయపడకుండా బిగ్గరగా అరవాలి.
అక్కడి నుంచి వెళ్లిపోవడం: ప్రమాదకర పరిస్థితిని గమనించిన వెంటనే ఆ ప్రదేశం నుంచి తప్పించుకోవాలి.
విషయాన్ని పంచుకోవడం: జరిగిన విషయాన్ని స్నేహితులు, తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు నిర్భయంగా చెప్పాలి.
చైల్డ్‌లైన్ నంబర్‌ను సంప్రదించడం: అత్యవసర సహాయం కోసం ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1098కు కాల్ చేయాలి.
పోలీసులకు ఫిర్యాదు చేయడం: ధైర్యంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి.
ముఖ్యంగా బాలికలు బాగా చదువుకుని సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సమయాన్ని వృధా చేసే మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. న్యాయ సహాయం కోసం డబ్బులు లేకపోయినా ఎవరైనా నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని, లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా న్యాయం చేకూరుస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు రాచూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రధానాచార్యులు కె. మల్లేష్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ప్రతినిధి గౌస్ పాషా, పాఠశాల ఆచార్యులు, మాతాజీలు మరియు విద్యార్థులుపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.