బీజేపీ జాతీయ అధ్యక్షుడు మన్నాలాల్ రావత్‌కు ఘన స్వాగతం
ప్రజావాణి ప్రతినిధి: నరేష్ నాయక్
భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంమెదక్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లావుడ్య రాములు నాయక్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు మన్నాలాల్ రావత్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గిరిజన ప్రాంతాల్లో బీజేపీ కార్యక్రమాల విస్తరణ, గిరిజనుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలో ఎస్టీ మోర్చాను మరింత బలోపేతం చేస్తూ, గిరిజన ప్రజలకు పార్టీ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని లావుడ్య రాములు నాయక్ తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం పార్టీ నాయకుల మధ్య సత్సంబంధాలను పెంపొందించడంతో పాటు, రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

