📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోలీస్ వ్యవస్థ పై విద్యార్థులకు అవగాహన

పోలీస్ వ్యవస్థ పై విద్యార్థులకు అవగాహన

📰 Generate e-Paper Clip

పోలీస్ వ్యవస్థ పై విద్యార్థులకు అవగాహన

జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం.. పోలీసుల విధులు బాధ్యతలను వివరించిన ఎస్సై మురళి

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 01

విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, విధులు బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. జుక్కల్ ఎస్సై మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివేకానంద పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్స్టేషన్లోని వివిధ విభాగాల పనితీరు కమ్యూనికేషన్ వ్యవస్థ, పోలీసుల విధులు బాధ్యతలను ఎస్సై వివరించారు.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం కేసుల దర్యాప్తు శాంతి భద్రత ల పరిరక్షణ, ప్రజలకు పోలీస్ శాఖ అందించే సేవల గురించి తెలియజేశారు. పోలీస్ శాఖలు వినియోగించే వివిధ పరికరాలు సమాచార వ్యవస్థ పనితీరుపై అవగాహన కల్పించారు.. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చి వారి సందేహాలను నీ వృత్తి చేశారు.. ఈ సందర్భంగా ఎస్సై మురళి మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతోపాటు సమాజంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ విధులు చట్టాలు పౌరుల బాధ్యతల గురించి చిన్ననాటి నుండి తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు.. పోలీస్ స్టేషన్ అంటే భయపడాల్సిన ప్రదేశం కాదని, ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేసే వ్యవస్థ అని వివరించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులకు సంప్రదించాలని సూచించారు.. ఓపెన్ హౌస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ప్రయోగిక పరిజ్ఞానం అందడంతో పాటు పోలీసు వ్యవస్థ పై నమ్మకం అవగాహన పెరుగుతాయని తెలిపారు. శాంతి బొద్ధతలో పరిరక్షణలో పోలీసుల పాత్రను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎస్సై మురళితోపాటు పోలీస్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.