📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadతొర్రూర్ లో పేకాటరాయుళ్ల అరెస్ట్

తొర్రూర్ లో పేకాటరాయుళ్ల అరెస్ట్

📰 Generate e-Paper Clip

 

ఎస్సై మహేందర్ రెడ్డి

తొర్రూరు
నవంబరు 1(ప్రజావాణి)

స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచిన పోలీసులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు జమ్లా తండా సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై తొర్రూరు పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,700 నగదుతో పాటు 52 పేకాట ముక్కలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి హెచ్చరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం అసాంఘిక కార్యక్రమాలపై నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.