📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవికసిత్ భారత్ – 2026 – 2027 కార్యక్రమం లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ఎంపిక

వికసిత్ భారత్ – 2026 – 2027 కార్యక్రమం లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ఎంపిక

📰 Generate e-Paper Clip

*వికసిత్ భారత్ – 2026 – 2027 కార్యక్రమం లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ఎంపిక*

*నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ –2026 – 2027 కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ (NSS) వాలంటీర్ల ఎంపిక చేసారు. ఈ ఎంపికకు వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్ల ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ పట్ల ఆసక్తి, బాధ్యతాయుతమైన ప్రవర్తన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక జరిగినట్టు ఎన్ ఎస్ ఎస్ కోర్డినేటర్ డా వెంకటరమణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వాలంటీర్లను ఉద్దేశించి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఎంపిక ప్రక్రియను పరిశీలించేందుకు జ్యూరీ సభ్యులుగా జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, సామాజికవేత్త సురేష్ గుప్తా, డా శశిధర్, జి.నర్సింహ, డాక్టర్ లక్ష్మీప్రభ, జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు రమేష్ నాయక్, షరీఫ్, ఆనంద్, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.