📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవరికోల్‌లో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం

వరికోల్‌లో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం

📰 Generate e-Paper Clip

వరికోల్‌లో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం

కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి

వరికోల్, అక్టోబర్ 31:ప్రజావాణి పత్రిక

వరికోల్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంటరానితనం, కులవివక్ష, సామాజిక అసమానతలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నడికూడ మండల తహసీల్దార్ రాణి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, చట్టపరమైన రక్షణలు, సామాజిక న్యాయం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి మాట్లాడుతూ కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో, ఆత్మగౌరవంతో జీవించే సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంటరానితనం, కులవివక్ష వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ గ్రామంలో ఐకమత్యం, సోదరభావం, సమానత్వాన్ని పెంపొందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ అధికారి శ్రీధర్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, సీసీ రేణుక, ఆర్ఐ సృజన్, వీఆర్ఓ శ్రీనివాస్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఏఈఓ తదితర అధికారులు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే ఉపసర్పంచ్ మురాల భుజంగరావు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, మహిళా సంఘాల సభ్యులకు, గ్రామ ప్రజలకు సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.