*విద్యార్థిని చదువుకు బాసటగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*
*తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న జమ్మికుంటకు చెందిన బిటెక్ విద్యార్థిని సాహితి కుటుంబ పరిస్థితి మంత్రి దృష్టికి తీసుకువచ్చిన సీనియర్ జర్నలిస్ట్*
*కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యం చెప్పి, భరోసానిచ్చిన మంత్రి*
*రూ.55వేలు కాలేజీ ఫీజు చెల్లించి,బాగా చదువుకోవాలని విద్యార్థిని సాహితిని ఆశీర్వదించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*
*భవిష్యత్ లోనూ ఉన్నత చదువులకు అండగా ఉంటానని హామీ..కృతజ్ఞతలు తెలిపిన సాహితీ,కుటుంబ సభ్యులు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
విద్యార్థిని చదువుకు బాసటగా నిలిచి మరోసారి తన దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇటీవల గుండె పోటు వల్ల తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన బిటెక్ విద్యార్థిని సాహితి కుటుంబ పరిస్థితి, ఇంజనీరింగ్ చదువు కోసం కాలేజీకి ఫీజు చెల్లించే విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి తన కార్యాలయ సిబ్బందిని అలెర్ట్ చేశారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీసిన మంత్రి, వారికి మనోధైర్యం చెప్పి, భరోసానిచ్చారు.
రూ.55వేలు కాలేజీ ఫీజు చెల్లించి, బాగా చదువుకోవాలని విద్యార్థిని సాహితిని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆశీర్వదించారు. మంత్రి ఆదేశాల మేరకు “కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్” ద్వారా విద్యార్థిని ఫీజును మంత్రి పి.ఎస్ నరేందర్ రెడ్డి విద్యార్థిని సాహితికి శనివారం సచివాలయంలో అందజేశారు.
భవిష్యత్ లోనూ సాహితీ ఉన్నత చదువులకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు..బాగా చదివి ప్రయోజకురాలివి కావాలని ఆకాంక్షించారు. విద్యార్థిని రూ.55 వేల కాలేజీ ఫీజు చెల్లించడమే కాకుండా.. భవిష్యత్ లో ఉన్నత చదువులకు భరోసానిచ్చిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి విద్యార్థిని సాహితి, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

