సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కూకట్పల్లి పోలీసులు
డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి
కూకట్పల్లి, అక్టోబర్ 31 (ప్రజావాణి):
సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా కూకట్పల్లి పోలీసులు ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ అవగాహన మాసం – అక్టోబర్ 2026లో భాగంగా శనివారం కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య గ్రౌండ్లో సాయంత్రం వాకింగ్‌కు వచ్చిన ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 నుంచి 150 మంది పాల్గొన్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, సోషల్ మీడియా మోసాలు, లోన్ యాప్ మోసాలు, పెట్టుబడులు, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు, ఇతరుల పేరుతో జరిగే మోసాలు, యూపీఐ మోసాలపై పోలీసులు వివరించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తెలిపారు.

