📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: ఎంపీడీవో

నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: ఎంపీడీవో

📰 Generate e-Paper Clip

నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: ఎంపీడీవో

జీపీ కార్యదర్శులు,విబిజి రాంజీ సిబ్బందితో రివ్యూ..

ప్రజావాణి,నెల్లికుదురు: ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సింగారపు కుమార్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. త్రాగునీరు, బీపీజీ రాంజీ పనులపై కార్యదర్శులు, విబిజి రాంజీ సిబ్బందితో ఎంపీడీవో సమావేశ మందిరంలో శనివారం ఎంపీడీవో రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని సంబంధిత సమస్యల పై ఉద్యోగులతో ఆరా తీశారు. పరిష్కారానికి సమాలోచనలు జరిపారు.ఎంపీడీవో పలు సూచనలు చేస్తూ రాబోయే రోజుల్లో త్రాగునీటి సమస్య పై ముందస్తు జాగ్రత్తలు చేపట్టడానికి రైతుల వద్ద బావులు,బోర్లు అద్దెకు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఊట కుంటల నిర్మాణం పై దృష్టి సారించి భూగర్భ జలాలను పెంచే విధంగా అడుగులు వేయాలన్నారు. ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకునేలా చూడాలన్నారు.అన్ని గ్రామాలలో
విబిజి రాంజీ పథకంలో పనులు నిర్వహిస్తూ కూలీల సంఖ్య భారీగా పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ యాసం వెంకటరమణ, ఏపీవో మాధవి పంచాయతీ కార్యదర్శులు,విబిజి రామ్ జి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.