నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: ఎంపీడీవో
నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: ఎంపీడీవో జీపీ కార్యదర్శులు,విబిజి రాంజీ సిబ్బందితో రివ్యూ.. ప్రజావాణి,నెల్లికుదురు: ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సింగారపు కుమార్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. త్రాగునీరు, బీపీజీ రాంజీ పనులపై కార్యదర్శులు, విబిజి రాంజీ సిబ్బందితో ఎంపీడీవో సమావేశ మందిరంలో శనివారం ఎంపీడీవో రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని సంబంధిత సమస్యల పై ఉద్యోగులతో ఆరా తీశారు. పరిష్కారానికి సమాలోచనలు జరిపారు.ఎంపీడీవో పలు సూచనలు చేస్తూ...