📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం -అరాచక వాదాన్ని అంతం చేద్దాం

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం -అరాచక వాదాన్ని అంతం చేద్దాం

📰 Generate e-Paper Clip

 

తొర్రూరు
అక్టోబర్ 31 (ప్రజావాణి)

రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ తొర్రూరు రూరల్ మండలం అద్యక్షులు గట్టు రాంబాబు ఆద్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పై ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ బీజేపీ చేపట్టిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం-అరాచక వాదాన్ని అంతం చేద్దాం అనే కార్యక్రమం లో భాగంగా మండలంలోని పలువురు ప్రభావశీల వ్యక్తులను కలవడం జరిగింది.ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజాస్వామ్య వ్యవస్థ లపై కాంగ్రెస్ మరియు వివిధ సంస్థలు చేస్తున్న దుషప్రచారం పై వాస్తవాలు తెలియజేస్తూ అవగాహన కల్పించడం జరిగింది.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పటిష్టమైన భద్రత కలిగిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ గా పేరు ప్రఖ్యాతులు పొందిన భారత ఎన్నికల సంఘం పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు ఇతర ప్రతిపక్షాలు కొంత మంది విధేశీ నిధులతో నడిచే సంస్థలతో చేతులు కలిపి అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తూ భారత సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే విధంగా వ్యవహరిస్తూ డిల్లీ వీధుల్లో అరాచకానికి పాల్పడుతూ అల్లర్లు రేపుతూ ప్రజల్లో అశాంతిని,భయాన్ని రేకేత్తించి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దించాలని కుట్రలకు పాల్పడుతున్నారు అని తెలిపారు.సాక్షాత్తు సుప్రీం కోర్టు వరకూ ర్యాలీ చేపట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ లను బ్లాక్ మేయిల్ చేయడానికి కుయుక్తులు పన్నడం దుర్మార్గమైన చర్య అని ,అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి నీచానికైనా తెగబడిపోతుందని తెలిపారు.రాష్ట్రంలో ఎల్ నీనో ప్రభావం వల్ల సాగు నీరు, త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు భరోసా కల్పించాల్సిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి వర్గం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి డిల్లీ వీధుల్లో అరాచకానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో నిమగ్నమై ఉందని ఎద్దేవా చేశారు.ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతూ అనేక కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది అని తెలిపారు.కాంగ్రెస్,సహా విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా,విధేశీ నిధులతో నడిచే సంస్థలతో చేతులు కలిపి ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు గమనిస్తున్నారు అని, వాస్తవాలు, నిజానిజాలు తెలసుకుని ధేశ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు అని తెలిపారు.ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు,అమ్మాపురం గ్రామ ఉప సర్పంచ్ సిరిపాటి విశాల్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గడల శేఖర్, గుండా సురేష్,ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు కిన్నెర వెంకన్న,వార్డు సభ్యులు పురాణపు బూబా మహేష్,మండల కార్యదర్శి తాడిశెట్టి నవీన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.