📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ భారీ చేయూత

తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ భారీ చేయూత

📰 Generate e-Paper Clip

తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ భారీ చేయూత.. సీఎం సహాయ నిధికి రూ.5.01 కోట్ల విరాళం

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 అమరావతి

అర్నబ్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల 1 లక్ష రూపాయల భారీ విరాళాన్ని అందించింది…

ఈ మేరకు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల సహాయార్థం అందిస్తున్న విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందజేసింది.

తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. విపత్తు సమయంలో బాధితులను ఆదుకునేందుకు బ్యాంకు యాజమాన్యం ముందుకు వచ్చి ఉదారంగా విరాళం అందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.