నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి కి కాంగ్రెస్ నేతల పరామర్శ
నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి అక్టోబర్ 31 శనివారం
.ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి భర్త శీలం నరసింహారావు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.. వారి భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరి భధ్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు,జెర్రిపోతుల సత్యనారాయణ,కుక్కల ఆదాం, కొమ్మూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

