📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ రాజకీయంలో పెను సంచలనం:సొంత మండలంలోనే టీడీపీ ఇంచార్జ్ సూర్యనారాయణ రెడ్డికి ఎదురుదెబ్బ.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో...

బద్వేల్ రాజకీయంలో పెను సంచలనం:సొంత మండలంలోనే టీడీపీ ఇంచార్జ్ సూర్యనారాయణ రెడ్డికి ఎదురుదెబ్బ.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 20 కుటుంబాలు!

📰 Generate e-Paper Clip

కడప జిల్లా నవంబర్ 19ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సురేష్ సూర్యనారాయణ రెడ్డికి ఆయన సొంత మండలంలోనే తీవ్ర అసంతృప్తి,గట్టి ఎదురుదెబ్బ తగిలింది.అట్లూరు మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.పోరుమామిళ్లలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి,ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి, నియోజకవర్గ యువ నాయకుడు మరియు ఎన్నికల రథసారథి దేవసాని ఆదిత్య రెడ్డిల సారథ్యంలో,అట్లూరు మండల పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ కుటుంబాలు అధికారికంగా వైఎస్సార్సీపీలో చేరాయి. పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి, దేవసాని ఆదిత్య రెడ్డిలు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సొంత మండలంలోనే తిరుగుబాటు.. టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి!

బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న సూర్యనారాయణ రెడ్డికి అట్లూరు సొంత మండలం కావడంతో ఇక్కడ ఈ స్థాయి తిరుగుబాటు రావడం నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల,స్థానిక నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కారణంగానే తాము పార్టీని వీడుతున్నట్లు చేరిన వారు పేర్కొంటున్నారు.ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలు తరలిపోవడం టీడీపీ బలహీనతను,స్థానిక ఇన్‌చార్జి వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వారిలో సిగే నాగమునయ్య,సిగే మాచర్లయ్య,సిగే చంద్ర,సిగే బ్రహ్మయ్య,సిగే బాలకేసి,సిగే చెన్నకేశి, బాల వెంకటయ్య, జవాది రవి,జవాది ఐవరయ్య,గంప వెంకటసుబ్బయ్య, జవాది చిన్న,మాదాపూర్ రవి,మాదాపూరి పెద్ద వెంకటసుబ్బయ్య,గంప రమణయ్య,గంప రమేష్,గంప రత్నమయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరులు ఉన్నారు.

రెడ్డిపల్లి గ్రామానికి వైఎస్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు. రెడ్డిపల్లి గ్రామానికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో పలుమార్లు ఈ గ్రామానికి విచ్చేసి ప్రజలతో ఆత్మీయ సంబంధాలను ఏర్పరచుకున్నారని ఆయన గుర్తుచేశారు.వైఎస్ కుటుంబానికి కూడా రెడ్డిపల్లి గ్రామం అంటే ఎనలేని ప్రత్యేక అభిమానమని పేర్కొన్నారు.బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 86 సర్పంచ్ స్థానాలు ఉండగా, అట్లూరు మండలంలోనే 12 సర్పంచ్ స్థానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అట్లూరు మండలంలో వైఎస్ కుటుంబం పట్ల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ చెక్కుచెదరలేదని వివరించారు. గతంలో జరిగిన జడ్పీటీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సామాజిక వర్గానికి సముచిత అవకాశం కల్పించి,వారి రాజకీయ ఎదుగుదలకు తోడ్పడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.రాబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ప్రతిపక్ష నేతలు కొందరు అధికారుల సహకారంతో ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం, ఓటర్లపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకురావడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని డి.సి.గోవిందరెడ్డి ఆరోపించారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా రానున్న సర్పంచ్ ఎన్నికలు తప్పకుండా జరుగుతాయని స్పష్టం చేశారు.ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని ఉన్నత పోలీసు అధికారులు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. కాబట్టి గ్రామ ప్రజలు కానీ,ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు కానీ ఎవరూ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగిపోవాల్సిన,భయపడాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు.అందరూ ధైర్యంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని వైఎస్సార్సీపీ విజయానికి తోడ్పడాలని కోరారు.ఈ భారీ చేరికల కార్యక్రమంలో అట్లూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి,లక్ష్మిరెడ్డి,లక్ష్మీ నర్సారెడ్డి,వెంకటేశ్వర్లు,డి.రమణ యాదవ్, శ్రీనివాసులు, పెంచల్ రెడ్డి, కృష్ణ తదితర ముఖ్య నేతలు మరియు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.సొంత మండలంలోనే టీడీపీ పట్టు కోల్పోవడం, ఎన్నికల వేళ వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు పెరగడం బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.