📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆదరించండి దొనకొండను అభివృద్ధి చేసుకుందాం

ఆదరించండి దొనకొండను అభివృద్ధి చేసుకుందాం

📰 Generate e-Paper Clip

ఆదరించండి దొనకొండను అభివృద్ధి చేసుకుందాం

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 30 దొనకొండ మండలం.

ప్రకాశం జిల్లా దొనకొండ మండల అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థి బత్తుల వెంకటలక్ష్మి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దొనకొండలోని వివిపురం, ముస్లిం బజారు, బ్యాంకు బజారు, వైశ్యాస్ బజార్ లో నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె పేరుపేరునా కోరారు. ఓటును ప్రభుత్వo దౌర్జన్యాలకు పాల్పడుతుందని మనమందరం కలిసికట్టుగా ఉండి టిడిపి వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు. వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన భర్త బత్తుల వెంకట సుబ్బయ్య పై అభిమాన నమ్మకంతో తనకు జెడ్పిటిసి గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి గుంటు పోలయ్య, మండల యూత్ వడ్లమూడి బుజ్జి, మండల ఎస్సీ సెల్ వినుకొండ కొండలరావు, దొనకొండ పట్టణ అధ్యక్షులు సయ్యద్ పాపా, ప్రకాశం జిల్లా కల్చర్ విభాగం షేక్ ముజాహిద్, మండల ఉపాధ్యక్షుడు ఇండ్ల శ్రీనివాసరావు, గుడిమెట్ల యాకోబు, గుడిమెట్ల పాపారావు, గుంటు కోటయ్య, ఎండూరు అచ్చయ్య, చీరాల ఇజ్రాయిల్, కప్పరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.