*సైలెంట్ పీరియడ్ పాటించాలి*
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 గుంటూరు జిల్లా
గుంటూరు, అక్టోబర్ 30 : పోలింగ్ కు ముందు 48 గంటల సైలెంట్ పీరియడ్ విధిగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై జిల్లా ఎన్నికల అధికారులతో శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్.ఇ.సి కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ
* ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎవరూ ఉండరాదని స్పష్టం చేశారు
* 48 గంటల ముందు మద్యం విక్రయాలపై నిషేధం అమలు పక్కాగా అమలు కావాలి
* సెక్షన్ 144 పకడ్బందీగా అమలు కావాలి
* పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్లు లోపల ఎవరు ఉండరాదు. వంద మీటర్ల తరువాత కూడా ఓటరును ప్రభావితం చేసే అంశాలు ఉండరాదు
* పోలింగ్ కేంద్రాల్లోకి ఏ వ్యక్తి పార్టీల కండువాలతో వెళ్ళరాదు
* ప్రజా ప్రతినిధులతో గన్ మెన్ లు వెళ్ళరాదు
* పోలింగ్ రోజు, నవంబరు 1వ తేదీన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వేతనంతో కూడిన సెలవు ప్రకటించడం జరిగింది
* మీడియా ప్రతినిధులు ఎన్నికల అధికారుల సూచనలు పాటించాలి
* ఓటు హక్కు గోప్యతను విధిగా పాటించాలి
* పోలింగ్ కేంద్రంలో ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించరాదు
* సున్నిత, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్నారు. 48 గంటల ముందు మద్యం విక్రయాలు, పోలింగ్ రోజున సెలవుపైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ సూపరింటెండెంట్ ను కోరడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా, పారదర్శకంగా జరుగుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి పాల్గొన్నారు.

