మహిళ భవన నిర్మాణానికి భూమి పూజ
మద్దూరు అక్టోబర్31, ప్రజా వాణి,
మండలంలోని ధర్మారం గ్రామ మహిళ భవన నిర్మాణ పనులకు సర్పంచ్ జక్కుల కనకమ్మ లింగయ్య చేతుల మీదుగా భూమి పూజ చేసి ముగ్గు పోశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్దే ద్యేయంగా అభివృద్ధి పనులను చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మహిళ భవన నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధుసూదన్, తెరాస నాయకులు జక్కుల రమేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

