తొర్రూర్
అక్టోబర్ 30
పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి కి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి హనుమండ్ల రాజేందర్ ఝాన్సీ రెడ్డి ఆశీర్వాదంతో,ముత్తినేని సోమేశ్వర్ రావు సహకారంతో తొర్రూర్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఖానాపురం గ్రామానికి చెందిన బచ్చలి లక్ష్మణ్ నియమితులైయారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియామకానికి పూర్తి సహకారం అందించి, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే నన్ను సహకరించిన తొర్రూర్ మండల, జిల్లా నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు, గ్రామ సర్పంచులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, సోషల్ మీడియా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బచ్చలి లక్ష్మణ్ మాట్లాడుతూ – “నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తాను. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాను” అని పేర్కొన్నారు.

