దోస్పల్లి గ్రామంలో గల పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ మారుతి
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 30
విద్యార్థుల సంక్షేమం మరియు విద్యాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఉచిత పాఠశాల దుస్తులను (యూనిఫారాలను) అందిస్తుందని, వీటికి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్పల్లి గ్రామ సర్పంచ్ మారుతి పిలుపునిచ్చారు.. దోస్పల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజున ఉచిత పాఠశాల దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా సర్పంచ్ మారుతి విద్యార్థులకు ఉచిత దుస్తులను పంపిణీ చేసి మాట్లాడారు.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై, శ్రద్ధగా చదువుకొని ఉన్నంత శిఖరాలను అధీ రోహించాలని, ఆకాంక్షించారు.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచిత భోజన పాఠ్యపుస్తకాలు, దుస్తులు వంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారుతి తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ దేశాయ్, సర్పంచ్ కపిల్, సర్పంచ్ కృష్ణ, మద్నూర్ ఏఎంసి చైర్మన్ భర్త రమేష్, ప్రధానోపాధ్యాయులు శంకర్, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు..

