📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ​పోలీసు అమరవీరుల సంస్మరణార్థం మందమర్రి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

​పోలీసు అమరవీరుల సంస్మరణార్థం మందమర్రి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

📰 Generate e-Paper Clip

*​పోలీసు అమరవీరుల సంస్మరణార్థం మందమర్రి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం*

*మన ప్రజావాణి*
*​మందమర్రి*

పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ “పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం” సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు,మందమర్రి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సమాజంలో ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం ద్వారా ప్రాణదానం చేయడమే అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ​ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) కిరణ్ కుమార్ సర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజ రక్షణ కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమం, సామాజిక సేవలో భాగస్వాములు కావడమే అమరవీరులకు అర్పించే సముచిత నివాళి అని పేర్కొన్నారు ​ఈ రక్తదాన శిబిరాన్ని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) రమేష్ సమన్వయం చేయగా… సర్కిల్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు (SI) గంగారాం, శ్రీధర్, శ్రావణ, నరేష్ సమిష్టిగా కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ​ఈ శిబిరానికి కావలసిన వైద్య, సాంకేతిక ఏర్పాట్లను రెడ్ క్రాస్ సొసైటీ బృందం పర్యవేక్షించి, రక్తం సేకరణ ప్రక్రియను సునాయాసంగా పూర్తి చేసింది ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ సిబ్బంది, స్థానిక యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.