📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ66వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

66వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

📰 Generate e-Paper Clip

66వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

ప్రొఫెసర్ కాలనీలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన

హసన్‌పర్తి, (మన ప్రజావాణి):

హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66వ డివిజన్ ప్రొఫెసర్ కాలనీలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు బాధ్యతలు నిర్వహిస్తున్న బీఎల్ఏ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొక్క కుమార్ పాల్గొని ఓటరు నమోదు ప్రక్రియపై వివరించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందస్తుగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హసన్‌పర్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బండి రజనీకుమార్, పొన్నాల రామయ్య, మహేందర్ రాజ్, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, పావని, సోనీరాజ్, మానస, శాశ్విత, వేణుగోపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.