📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రక్తదాన శిబిరం

వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రక్తదాన శిబిరం

📰 Generate e-Paper Clip

వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రక్తదాన శిబిరం

150 మందికి పైగా స్వచ్ఛంద రక్తదానం.. యువత సేవాభావానికి అభినందనలు

వరంగల్, అక్టోబర్ 29: వరంగల్‌ జిల్లా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో 150 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందించారు. యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గీసుగొండ సీఐ విశ్వేశ్వర్‌ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, శస్త్రచికిత్సల సమయంలో రక్తం అవసరమైన రోగులకు రక్తదాతలు అందించే సహకారం ఎంతో విలువైనదని తెలిపారు. యువత సామాజిక బాధ్యతగా భావించి రక్తదాన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, రక్తం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొనే రోగులకు సహకరించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు రావడం సమాజంలో సేవాభావం, మానవతా విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జన్ను రమేష్‌, నాగరాజు, అనిల్‌, రజనీకాంత్‌, అమర్‌నాథ్‌, సందీప్‌రాజు తదితరులు పాల్గొన్నారు. “రక్తదానం చేయండి – ప్రాణదాతలుగా నిలవండి” అనే సందేశంతో నిర్వహించిన ఈ శిబిరం విజయవంతమైంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.