📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపాలకుర్తి మండల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి మండల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

పాలకుర్తి మండల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29(ప్రజావాణి): జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని
పాలకుర్తి మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అధికారులకు సూచించారు.
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులు, గ్రామాల ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండలంలో గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్య, వైద్యం, సాగునీరు వంటి మౌలిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజాప్రతినిధులు తమ గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తేగా, వాటికి తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
పాలకుర్తి మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.