కరాటేలో పతకాల పంట.. జాతీయ పోటీలకు ఎంపికైన ఐదుగురు విద్యార్థులు!
సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన పటాన్చెరు క్రీడాకారులు
విజేతలను అభినందించిన బీఆర్ఎస్ నేతలు వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి
పటాన్చెరు,అక్టోబర్ 29 (ప్రజావాణి): కరాటే పోటీల్లో పటాన్చెరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు పతకాలతో సత్తా చాటారు. విశాఖపట్నంలోని గాజువాక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన 5వ కేఐవో సౌత్ జోన్ కరాటే ఛాంపియన్షిప్–2026లో మాస్టర్ జి. అగస్టిన్ ఆధ్వర్యంలోని సెరియోకు షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేతలు పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. సింధు ఆదర్శ్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. పోటీల్లో జి. విహాన్ కుమిటే విభాగంలో స్వర్ణం, కటాలో రజత పతకం సాధించగా, జి. రిత్విక్ కుమిటేలో స్వర్ణం, కటాలో కాంస్య పతకం సాధించాడు. వై. తన్వి రెడ్డి కుమిటేలో రజత పతకం, సయ్యద్ మహమ్మద్ తాహా, హెచ్. ఆద్య శ్రీ కటా విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. ఈ ఐదుగురు విద్యార్థులు డిసెంబర్ 16, 17 తేదీల్లో ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్కు ఎంపిక కావడం అభినందనీయమని ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి పేర్కొన్నారు. చిన్న వయసులోనే క్రమశిక్షణ, పట్టుదలతో కరాటేలో రాణించడం గర్వకారణమన్నారు. జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి, పటాన్చెరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి విజయపథంలో నడిపిస్తున్న కరాటే మాస్టర్ జి. అగస్టిన్ను ప్రత్యేకంగా అభినందించి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

