📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహత్నూరలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

హత్నూరలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

హత్నూరలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

హత్నూర: సంగారెడ్డి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ 70వ వాలీబాల్ టోర్నమెంట్, సెలక్షన్ పోటీలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జ్యోతి ప్రజ్వలన చేసి, బెలూన్లు, పావురాలను ఎగురవేసి పోటీలకు శ్రీకారం చుట్టారు.

ఈ పోటీల్లో జిల్లాలోని 28 మండలాలకు చెందిన వివిధ పాఠశాలల నుంచి 750 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థినులు భక్తి గీతాలకు నృత్యాలు ప్రదర్శించి అలరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని, వాలీబాల్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే విద్యార్థినులతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రతిభావంతులైన క్రీడాకారిణులు ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.