జనగామ పట్టణంలోని 3వ వార్డులో ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు జనగామ పట్టణంలోని 3వ వార్డులో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు జి. దామోదర్ రెడ్డి అధ్యక్షతన కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ఆయురారోగ్యాలతో, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజమౌళి , పీసీసీ మెంబర్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి విచ్చేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి చేస్తున్న కృషి అభినందనీయమని, జనగామ జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ ఉపాధ్యక్షులు ముత్తాల ప్రభాకర్, దిశ కమిటీ మెంబర్ బక్క శీను, జిల్లా సీనియర్ నాయకులు దామెర నాగరాజు , జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అల్వలా రమేష్, సమ్మయ్య, సీనియర్ నాయకులు దుర్గేష్, 3వ వార్డు మాజీ అధ్యక్షులు మచ్చ ప్రవీణ్, కె. రమేష్, రాజేశ్వర్, పిట్టల రాజు, ఆంజనేయులు, శ్రీనివాస్ కుమార్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

