📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రాలను మర్యాదపూర్వకంగా కలిసిన టీయూడబ్ల్యూజే (హెచ్-143) నూతన కార్యవర్గం
అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుత పాత్ర పోషించాలని ఎస్పీ పిలుపు

పరిగి:ప్రజావాణి ,అక్టోబర్ 28:

జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే – హెచ్-143) వికారాబాద్ జిల్లా నాయకులు కోరారు. బుధవారం నూతనంగా ఎన్నికైన జిల్లా యూనియన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాలను వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు.
ముందుగా కలెక్టర్ దీపక్ తివారీని కలిసి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. జిల్లాలో పనిచేస్తున్న విలేకరుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న డీపీఆర్‌వోను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాను కలిసి శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా, నియోజకవర్గ కార్యవర్గాల వివరాలను ఆమెకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు, మీడియా పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా సున్నితమైన కేసుల విషయంలో తొందరపాటు లేకుండా, పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతే వాస్తవాలను ప్రచురించాలని కోరారు. నిరాధారమైన కథనాలు ప్రచురించకుండా, నిజాలను మాత్రమే వెలుగులోకి తెస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాదచారి, జిల్లా కమిటీ నాయకులు కొత్త శ్రీనివాస్, పర్షమోని బాబు, పండాల సురేష్, పరిగి డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, వికారాబాద్ డివిజన్ అధ్యక్షులు గోపాల్, దోమ మండల అధ్యక్షులు రాము ముదిరాజ్, నాయకులు నర్సింలు, అమర్, అరుణ్, జావిద్, నాగిరెడ్డి, రఘు, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.