హత్నూరలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

హత్నూరలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హత్నూర: సంగారెడ్డి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ 70వ వాలీబాల్ టోర్నమెంట్, సెలక్షన్ పోటీలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జ్యోతి ప్రజ్వలన చేసి, బెలూన్లు, పావురాలను ఎగురవేసి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ పోటీల్లో జిల్లాలోని 28 మండలాలకు చెందిన వివిధ పాఠశాలల నుంచి 750 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థినులు భక్తి గీతాలకు నృత్యాలు...