📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకుల్కచర్లలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

కుల్కచర్లలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

📰 Generate e-Paper Clip

కుల్కచర్లలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు: ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్, బీజేపీ నాయకులు.

పరిగి /కుల్కచర్ల:ప్రజావాణి,అక్టోబర్ 28:

కుల్కచర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (టీఆర్‌ఆర్) సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పటేల్ చెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ శాంతి తుల్జారాం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరగా, బీజేపీ కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఏదుల సంతోష్ గౌడ్ కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
సంక్షేమ పాలనకు ఆకర్షితులై చేరికలు
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. పరిగి నియోజకవర్గ ప్రగతి కోసం ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన నాయకత్వంలో నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కార్యకర్తలకు తగిన గుర్తింపు: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ విధానాలు నచ్చి పార్టీలోకి వస్తున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం, గుర్తింపు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.