📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు

జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు

ఓబుల్ కేశ్వాపూర్ జడ్పీ హైస్కూల్లో బాల బాలికలకు సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జనగామ జిల్లా ఆధ్వర్యంలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శంకర శ్రీదేవి ఆదేశానుసారం జిల్లా పరిషత్ హైస్కూల్, ఓబుల్ కేశ్వాపూర్ నందు బాల బాలికలకు సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ (Protection of Children from Sexual Offences Act) – పోక్సో చట్టం పై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జనగామ అడ్వకేట్ మంచాల రవీందర్ మాట్లాడుతూ
“నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) వారి ఆదేశానుసారం ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పాఠశాలలో ఈ అవగాహన సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే – 18 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలకు రక్షణ కల్పించడం. 18 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థినీ విద్యార్థులు వివాహం చేసుకోరాదని, శారీరక సంబంధాలు పెట్టుకోరాదని, ఈ పోక్సో చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని,ఇది చాలా పెద్ద నేరం. ఈ చట్టం కింద నేరానికి పాల్పడిన వారికి ఒక్కోసారి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉందన్నారు. బాధితులకు రక్షణ కల్పించడం, వారి కోసం ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, మంచి చెడులను తెలుసుకుని విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, తమ చదువుపై దృష్టి పెట్టాలి” అని విద్యార్థులకు వివరించారు.

చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులను ఎలా గుర్తించాలి, అలాంటి పరిస్థితి ఎదురైతే 1098 చైల్డ్ లైన్ నంబర్ కు, 100 కు ఫోన్ చేయాలని, అలాగే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. బాల్య వివాహాలు కూడా పోక్సో చట్టం పరిధిలోకి వస్తాయని, తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎం. వాసుదేవరెడ్డి, పీఎల్వీ పాలమాకుల జితేందర్, స్కూల్ అసిస్టెంట్ నరసింహారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.