📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాళేశ్వరం జలాలను విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలి

కాళేశ్వరం జలాలను విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలి

📰 Generate e-Paper Clip

కాళేశ్వరం జలాలను విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలి

రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది:

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి అక్టోబర్ 28

పెద్దపల్లి: వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలను వినియోగించి ఎండిపోతున్న పంటలను తక్షణమే కాపాడాలని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన నిరసన సైకిల్ యాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమైన ఈ యాత్రను పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, రామగుండానికి చెందిన బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ.. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో సుమారు 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నీటి లభ్యతపై స్పష్టతనిచ్చి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయ రంగానికి వరప్రదాయినిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వహణ విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

పంటలు ఎండిపోతున్న తరుణంలో రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు, రైతుబంధు, బోనస్ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నీటి విడుదల విషయంలో సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో బాధ్యతల నుంచి తప్పుకోవడం సరికాదని, క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించి సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

కాళేశ్వరం పరివాహక ప్రాంతాల్లో ప్రతిరోజూ సుమారు 40 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణిస్తూ రైతుల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్న నాయకుల కృషి అభినందనీయమని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, కాశీపాక వాసు, సురేష్, పల్లె మధు, కౌన్సిలర్ విన్నం సుజాత రవీందర్, మాజీ కౌన్సిలర్ నాంసాని సురేష్ బాబు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.