ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
చేర్యాల మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్
మద్దూరు అక్టోబర్28, ప్రజా వాణి,
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని చేర్యాల మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్ అన్నారు.బుదవారం మండలంలోని నర్సాయపల్లి గ్రామ స్వర్ణ వి ఓ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల సర్పంచుల ఫోరమ్ గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణతో కలిసి కొబ్బరి కాయ కొట్టి ఆయన ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో మాజీ చైర్మెన్ రమేష్ రెడ్డి,మాజీ డైరెక్టర్ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు తోడంగల భాస్కర్, గ్రామ శాఖ అద్యక్షులు ముస్త్యాల బాబు, రామ్ రెడ్డి,ప్రశాంత్,శనివారం కనకయ్య, సి సి సుమలత,గ్రామ వి ఓ సంఘం అధ్యక్షులు పి.నవనీత,కార్యదర్శి మంజుల, వి ఓ ఏ స్రవంతి,కోశాధికారి సుశీల,శివకుమార్,శ్రీలత,రైతులు ఇర్రి సుధాకర్ రెడ్డి, మొకు కనకరెడ్డి, ఇర్రి ధర్మారెడ్డి, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

