📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపసర ZPHS.. చదువులోనే కాదు.. ఆటల్లోనూ నంబర్ వన్

పసర ZPHS.. చదువులోనే కాదు.. ఆటల్లోనూ నంబర్ వన్

📰 Generate e-Paper Clip

*పసర ZPHS.. చదువులోనే కాదు.. ఆటల్లోనూ నంబర్ వన్*
.హైదరాబాద్ కు పసర బిడ్డలు.. రాష్ట్ర స్థాయికి హర్షిత్, శివనందు..
. పసర విద్యార్థుల విజయ పరంపర.. పీఎం శ్రీ క్రీడల్లో ప్రభంజనం.
.గురువు కవిత కృషి.. శిష్యుల ఘన విజయం.

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలం
పసర జడ్పీహెచ్ఎస్ పాఠశాల అంటేనే విజయాలకు కేరాఫ్ అడ్రస్ అని మరోసారి రుజువైంది. పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో పసర విద్యార్థులు సత్తా చాటి, పాఠశాల పతాకాన్ని రెపరెపలాడించారు.
జిల్లా స్థాయి పోటీల్లో అండర్-14 కబడ్డీ విభాగంలో ప్రథమ స్థానం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అండర్-14 ఖో-ఖో, అండర్-17 వాలీబాల్, అండర్-17 ఖో-ఖో విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటారు.
ఈ విజయాలతో నవంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పసర పాఠశాల నుండి కబడ్డీ విభాగంలో జాడి హర్షిత్, కోకిల శివనందు ఎంపిక కావడం విశేషం.
విద్యార్థుల ఈ ఘన విజయం వెనుక వ్యాయామ ఉపాధ్యాయిని శ్రీమతి మారబోయిన కవిత గారి నిరంతర కృషి, శిక్షణ ఎంతో ఉందని ప్రధానోపాధ్యాయులు కొమరపాలెం సమేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయిని కర్ర జయశ్రీ గార్లు హర్షం వ్యక్తం చేశారు. విజేతలను ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.