📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

📰 Generate e-Paper Clip

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి!

సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

హసన్‌పర్తి,మన ప్రజావాణి:28

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హసన్‌పర్తి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏ. మహేందర్ ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ సందర్శన (ఓపెన్ హౌస్) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి ఇన్‌స్పెక్టర్ ఏ. మహేందర్ విద్యార్థులకు వివరించారు. పోలీస్ శాఖలో వినియోగించే ఆయుధాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నేరాల నియంత్రణకు పోలీసులు చేపట్టే చర్యలను ప్రత్యక్షంగా వివరించి విద్యార్థుల్లో అవగాహన కల్పించారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి

దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తారని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతాభావాన్ని పెంపొందించేలా అవగాహన కల్పించారు.

సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, మహిళలు మరియు బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖపై అవగాహన పెరగడంతో పాటు, చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత అలవడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.