📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎల్కతుర్తిలో ఘనంగా ఐఎఫ్‌డబ్ల్యూజే 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎల్కతుర్తిలో ఘనంగా ఐఎఫ్‌డబ్ల్యూజే 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తిలో ఘనంగా ఐఎఫ్‌డబ్ల్యూజే 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జర్నలిస్టులకు పెన్షన్ ఇళ్ల స్థలాలు కేటాయించాలి.

జాతీయ కార్యవర్గ సభ్యుడు చుంచు ఐలయ్య

ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాతూరి చంద్రమౌళి.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) జాతీయ కార్యవర్గ సభ్యుడు చుంచు ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఎల్కతుర్తిలో ఐఎఫ్‌డబ్ల్యూజే 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఐఎఫ్‌డబ్ల్యూజే అనుబంధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఏర్పాటైందని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి అధికారులను ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు వారి భద్రతకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ జర్నలిస్టులకు ప్రాధాన్యం కల్పించి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమం భద్రత ఆర్థిక భరోసా విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి ప్రెస్ క్లబ్ అసోసియేషన్ చైర్మన్ సాతూరి చంద్రమౌళి ప్రెస్ క్లబ్ సభ్యులు డాక్టర్ ఉదయ్ చందర్,శ్రీరామోజు సతీష్,నరేష్ బెజ్జంకి,జూపాక శ్రీనివాస్,ఎర్రోళ్ల రాజబాబు,రాజిరెడ్డి, అడ్డూరి అనిల్,బొంకూరి కార్తీక్,బొంకూరి వంశీ,ఎర్రోళ్ల సతీష్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.