కూసుమంచి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి
కూసుమంచి అక్టోబర్ 28, మన ప్రజావాణి ప్రతినిధి RK :
ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం కూసుమంచి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరును పరిశీలించి, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు.
సీసీటీఎన్‌ఎస్ (CCTNS) వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, రహదారి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న దర్యాప్తు కేసులను త్వరితగతిన పూర్తి చేసి పరిష్కరించాలని, ప్రతి కేసు పురోగతిని నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుల నిమిత్తం వచ్చిన బాధితులతో పోలీస్ కమిషనర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

