📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

📰 Generate e-Paper Clip

మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
కూసుమంచి అక్టోబర్ 28 ( మన ప్రజావాణి ) ప్రతినిధిRK: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కూసుమంచి మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన కార్యక్రమం కొనసాగుతోంది.
మంత్రి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
రక్తదానం చేయండి… ప్రాణదాతలు కండి! అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు.
ప్రజావాణి – ప్రజల పక్షం, ప్రజా సమస్యల గొంతుక.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.