ఓటర్ నమోదు కేంద్రాన్ని పరిశీలించిన శంకర్ నాయక్
– రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
ప్రజావాణి,ఇనుగుర్తి: వరంగల్ –ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి లోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటర్ల నమోదు కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.నమోదు కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రుల వివరాలను సేకరించి వారిని ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను పార్టీ శ్రేణులు తీసుకోవాలని ఆదేశించారు. ఇనుగుర్తి మండలంలో ఏ ఒక్క అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కోల్పోకుండా, ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ స్వయంగా సంప్రదించాలని సూచించారు.కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న, ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి, బేతమల్ల చంద్రయ్య,ఈర్లూ నాయక్,గుగులోత్ నరేందర్ నాయక్, వార్డు సభ్యులు వేముల శ్రీనివాస్, నాయకులు లింగాల శ్రీనివాస్, కుంచాల నవీన్,గడ్డం శ్రీకాంత్, బూర రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

