📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబిజిగిరి షరీఫ్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

బిజిగిరి షరీఫ్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

బిజిగిరి షరీఫ్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

ఖేత్ బచావో అభియాన్ శిక్షణ

* వ్యవసాయ అధికారి బి అచ్యుత్ ఆయిల్పామ్ ఎఫ్ ఏ శ్రీదర్ రైతులు

జమ్మికుంట అక్టోబర్ 27 (ప్రజావాణి)

జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడంజరిగిందికార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త వేంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు ఖేత్ (నేలని) కాపాడాలని కోరారు భూమి ఆరోగ్యం మనిషి ఆరోగ్యం లాగే చాలా ముఖ్యమైనదని , ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు కొరకు రైతులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుచేసిన భూమి భావితరాలకు సారవంతంగా ఉండి భవిష్యత్తులో మంచి దిగుబడులను ఇవ్వగలదని తెలిపారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో హైడల్ పవర్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో తగ్గినందున రైతులు ప్రభుత్వం సూచించిన విధంగా వరి పంటను సాధ్యమైనంత తగ్గించాలని కోరారు. నీటి వసతి ఉన్న రైతులు వీలైనంత వరకు ఆరుతడి పంటలైన పెసర, మినుము, కుసుమ, నువ్వులు,పొద్దుతిరుగుడు, మంచి శనగ, బుడ్డ శనగ, మొక్క జొన్న పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని తెలిపారుకార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి షేక్ ఖాదర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను రైతులు పాటించాలని కోరారు. మొక్క జొన్న (డి హెచ్ ఎం206- కరీంనగర్ మక్క 3), మంచి శనగ, కుసుమ విత్తనాలను రైతులకు సబ్సిడీ పై అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతు రిజిస్ట్రీ చేసుకున్న రైతులకు ఇట్టి విత్తనాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఆసక్తి గల రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ని సంప్రదించాలనికోరారుకార్యక్రమం లో ఉద్యానవన అధికారి మంజులత మాట్లాడుతూ ఆయిల్పామ్ పంట మంచి లాభదాయకైన పంట అని తెలిపారు. ఒకసారి పంట సాగు చేస్తే 30 సంవత్సరాల వరకు దిగుబడులను పొందవచ్చని తెలిపారు. సబ్సిడీ పై స్ప్రింక్లర్ కొరకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనికోరారుకార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారి బి అచ్యుత్ ఆయిల్పామ్ ఎఫ్ ఏ శ్రీదర్ రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.