📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమధురమైన గానం మూగబోయింది జ్యోతి జ్ఞాపకాలతో కన్నీటి పర్యంతమైన పూర్వ విద్యార్థులు

మధురమైన గానం మూగబోయింది జ్యోతి జ్ఞాపకాలతో కన్నీటి పర్యంతమైన పూర్వ విద్యార్థులు

📰 Generate e-Paper Clip

మధురమైన గానం మూగబోయింది జ్యోతి జ్ఞాపకాలతో కన్నీటి పర్యంతమైన పూర్వ విద్యార్థులు

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గోపాల్పూర్ లో చిన్ననాటి నుంచే పాటలంటే ఎంతో ఇష్టం ఆటపాటలతో తోటి విద్యార్థులను అలరించిన ఆమె ఇక తమ మధ్య లేదనే వార్తను పూర్వ విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు తరగతి గదిలో మైక్ పట్టుకుని అంబేద్కర్‌కు సంబంధించిన పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకున్న మద్దెల జ్యోతి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమె స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
గోపాల్పూర్ గ్రామానికి చెందిన మద్దెల జ్యోతి అంగన్‌వాడీ టీచర్‌గా 15 సంవత్సరాల పాటు సేవలందించారు. అనంతరం వివాహం చేసుకుని కొత్త కొండ దర్మారం గ్రామంలోని అత్తవారింట్లో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అనివార్య కారణాలతో రెండు సంవత్సరాల క్రితం జ్యోతి మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచింది. ఆ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే, అనారోగ్య కారణాలతో ఆమె భర్త కూడా మరణించడంతో ఒకే ఏడాదిలో భార్యాభర్తలు ఇద్దరూ దూరం కావడం కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
1987–88 సంవత్సరాల్లో ఎస్‌ఎస్‌సీ చదువుకున్న సమయంలో జ్యోతి తమతో కలిసి చదువుకున్న 85 మంది విద్యార్థులకు ఎంతో ఆత్మీయురాలు. చదువుతో పాటు పాటలు పాడటం, కబడ్డీ, ఖోఖో వంటి ఆటల్లో పాల్గొనడం ఆమెకు ఎంతో ఇష్టం. తన మధురమైన గాత్రంతో పాఠశాలలో తోటి విద్యార్థులను అలరించేది. తరగతి గది ముందు మైక్ పట్టుకుని పాటలు పాడుతున్న ఆమె వీడియోలను ఇప్పుడు చూస్తున్న పూర్వ విద్యార్థులు, తమ కళ్లముందే ఆమె ఉన్నట్లుగా భావిస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు.
జ్యోతి మా మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. ఆమె పాటలు, నవ్వులు, మాతో గడిపిన పాఠశాల రోజులు ఇప్పటికీ మా కళ్లముందు కదలాడుతున్నాయి. ఆమె పాడిన పాటల వీడియోలు చూసినప్పుడల్లా జ్యోతి ఇంకా మా మధ్యే ఉందనే భావన కలుగుతోంది. ఆమెను మర్చిపోవడం మా వల్ల కావడం లేదు” అంటూ 1987–88 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కొద్ది నెలల వ్యవధిలోనే మృతి చెందడం అత్యంత బాధాకరమని, వారి పిల్లల భవిష్యత్తు తలుచుకుంటే మనసు కలచివేస్తోందని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మనిషి దూరమైనా జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. జ్యోతి పాడిన పాటలు, ఆమెతో గడిపిన మధురమైన పాఠశాల రోజులు తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని ఆమె పూర్వ విద్యార్థులు భావోద్వేగంతో గుర్తుచేసుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.