రైతులు ఆధునిక మెళకువలు పాటించాలి:
ఎం.ఏ.వో షేక్ యాస్మిన్
ప్రజావాణి,ఇనుగుర్తి: వ్యవసాయ సాగులో ఆధునిక మెలకువలు పాటించి ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ రైతులకు సూచించారు. మండల కేంద్రం ఇనుగుర్తి లో వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థసంయుక్త ఆధ్వర్యంలో రైతులకు మంగళవారం స్థానిక రైతు వేదికలో వరి పొలంబడి పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏవో రైతులకు వరి పొలంబడిపై మెలకువలను వివరించారు. క్షేత్రస్థాయిలో ఇనుగుర్తిలోని గంజి శ్రీనివాస్ పొలాన్ని సందర్శించి వరి పంట పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఏవో మాట్లాడుతూ వరి పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం పద్ధతులు,సేంద్రియఎరువుల వాడటం సమగ్ర క్రిమిసంహారకాల మందుల యాజమాన్యం పద్ధతులు పాటించడం గూర్చి,
విత్తన శుద్ధి, నేల సార పరిరక్షణ పద్ధతులు అనుసరించి సాగు ఖర్చును తగ్గించి నాణ్యమైన దిగుబడి పొందే పద్ధతులను వివరించారు.ఈ కార్యక్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి వి.భాస్కర్,రైతులు పాల్గొన్నారు.

